అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కొత్త రేషన్‌ కార్డుల జారీపై రాష్ట్ర కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ అయ్యింది. విధావిధానాలు రూపొందించేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. భేటీలో మంత్రుల పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. రేషన్‌ కార్డుల కోసం గ్రామాల్లో అయితే వార్షికాదాయం రూ.లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక అయితే 7.5 ఎకరాల్లోపు ఉన్నవారిని అర్హులుగా గుర్తించాలని సూచించారు. అలాగే పట్టణ ప్రాంతాల ప్రజలైతే వార్షికాదాయం రూ.2 లక్షలలోపు ఉన్నవారయితే అర్హులుగా తీసుకోవాలని ప్రతిపాదించారు.