అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వచ్చేనెల 3న కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎల్లారెడ్డితో పాటు నల్గొండ జిల్లా నకిరేకల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక కూడా జరగనుంది. కాగా.. ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ కుడుముల సత్యనారాయణ ఎంపీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఆయనపై అవిశ్వాసం తీర్మానం పెట్టగా నెగ్గింది. అనంతరం బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం గమనార్హం. త్వరలో ఎన్నిక జరుగనుండడంతో ఛైర్మన్‌ పీఠం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Hanuman victory | ఎల్లారెడ్డి పట్టణంలో ఘనంగా హనుమాన్ విజయోత్సవ ర్యాలీ