అక్షరటుడే, వెబ్​డెస్క్​: ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. మార్చి 1న కొత్త రేషన్​( New Ration Cards) కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ అమలులో లేని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒకే రోజు లక్ష కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. మిగతా జిల్లాల్లో మార్చి 8వ కొత్త రేషన్ కార్డులు అందించాలని నిర్ణయించింది.

Advertisement

జనవరి 26న ప్రారంభం

కాంగ్రెస్​ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగా నాలుగు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. నూతన రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా పథకాలను మండలానికి ఓ గ్రామం చొప్పున ప్రజాప్రతినిధులు అట్టహాసంగా ప్రారంభించారు. ఆ రోజు 16వేల కుటుంబాలకు నూతన రేషన్​ కార్డులు అందించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Farmers | పత్తి సేకరణలో తెలంగాణ టాప్​

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​తో..

ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్​‌‌–కరీంనగర్​–నిజామాబాద్​–మెదక్​ పట్టభద్రుల, ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. అలాగే ఉమ్మడి వరంగ్​ల్​–ఖమ్మం–నల్గొండ టీచర్​ ఎన్నిక ఈ నెల 27న నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్​ అమలులో ఉంది. దీంతో మిగతా జిల్లాల్లో నూతన రేషన్​కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement