అక్షరటుడే, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ(పాక్స్) పాలకవర్గాల పదవీకాలన్ని 6 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, డీసీసీబీ ఛైర్మన్లు సత్తయ్య, రమేష్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, బోజా రెడ్డి, వేంకటేశ్వర రావు, టీజీ క్యాబ్ ఎండీ గోపి కలిసి ఉత్తర్వులు అందుకున్నారు. సహకార సంఘాల పదవీకాలం పొడగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement