అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఇథనాల్‌ ఫ్యాక్టరీని పనులు నిలిపివేయలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ను ఆదేశించింది. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత బీఆర్‌ఎస్‌ హయంలో ఇచ్చిన అనుమతులపై పున: సమీక్ష జరిపింది. దీంతో ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు నిలివేయాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు.