అక్షరటుడే, కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం నిధులను విడుదల చేసింది. ఎలక్షన్‌ కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో నిధులకు సంబంధించిన జీవో విడుదలైంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రంలో 15,814 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 10వేల ఎకరాల్లో, నిజామాబాద్‌ జిల్లాలో 1652 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తక్షణ సాయం కింద ప్రభుత్వం రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాకు రూ. 10 కోట్లు, నిజామాబాద్‌ జిల్లాకు రూ. 1.65 కోట్లు కేటాయించారు. ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.