అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌: ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని భారతీయ కిసాన్‌ సంఘ్ రాష్ట్ర నాయకులు విన్నవించారు. హన్మకొండలోని విద్యుత్‌ భవనంలో మంగళవారం టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డిని కలిశారు. ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురైతే సిబ్బంది వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈమేరకు కామారెడ్డి జిల్లా రైతులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్‌ సంఘ్ అఖిలభారత కార్యవర్గ సభ్యులు ముదుగంటి శ్రీధర్‌రెడ్డి, దోనూరు రాము, రాష్ట్ర కార్యదర్శి ఆనందరావు, ప్రచార ప్రముఖ్‌ ల్యాగాల శ్రీనివాస్‌, కొమిరెడ్డి అంజన్న, వెంకట్‌ రెడ్డి, పోలబోయిన మురళీధర్‌, జలంధర్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌, శరత్‌ కుమార్‌, శ్రీనివాస్‌ రైతులు పాల్గొన్నారు.