అక్షరటుడే, జుక్కల్: పెద్ద కొడప్‌గల్ మండల కేంద్రంలో బుధవారం ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్ద కొడప్‌గల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. అండర్ 14, 17 విభాగాల్లో 23 మంది విద్యార్థినులు జిల్లాస్థాయికి అర్హత సాధించారు. దీంతో విద్యార్థినులు, పీఈటీ జ్యోతిని పాఠశాల ప్రిన్సిపల్ సునీత అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ నాగరాణి, ఉపాధ్యాయులు రాములు, విఠల్, పవన్ ఉన్నారు. గెలుపొందిన విద్యార్థినులు ఈనెల 28న జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.