అక్షరటుడే, వెబ్‌డెస్క్ : నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడంతో సబ్‌రిజిస్ట్రార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పద్మాజారెడ్డి అనే మహిళ జీడిమెట్లలోని సుభాష్‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ల్యాండ్‌ను కబ్జా చేశారు. అయితే అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న జ్యోతి సహకరించారని ఆరోపణలు వచ్చాయి. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పద్మజారెడ్డిపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఈకేసులో ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో సబ్‌రిజిస్ట్రార్ జ్యోతి సహకరించిన విషయం వెలుగులోకి రావడంతో మంగళవారం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం కోర్టులో ఆమెను ప్రవేశపెట్టగా.. ధర్మాసనం 14 రోజుల రిమాండ్ విధించింది.