అక్షరటుడే, కామారెడ్డి: కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని భూపుత్రమ్మ కల్యాణ మండపం వద్ద నివసించే శిరీష(28) బిచ్కుందలో కాంటాక్ట్ ఫార్మసిస్ట్ గా పని చేస్తోంది. ఆమెకు ఏడేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండేళ్ల క్రితం భర్త బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లాడు. కాగా బుధవారం రాత్రి ఆమె రేకుల షెడ్డులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.