అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సీబీఐ, ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేయగా.. రెండు న్యాయస్థానాలు నిరాకరించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆప్ నేత సిసోడియాకు సుప్రీం బెయిల్ మంజూరు చేయడంతో.. తనకు కూడా బెయిల్ వస్తుందని ఆశించి కవిత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.