అక్షరటుడే, వెబ్‌డెస్క్: కోల్‌కతాలో వైద్యురాలి హత్యచార ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. కేసును సుమోటోగా స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు ఘటనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దారుణమైన ఘటన జరిగితే ఆత్మహత్య అంటూ ఎలా చెప్పారంటూ మండిపడింది. మృతురాలి తల్లిదండ్రులను మూడు గంటపాటు ఎందుకు వేచి చూసేలా చేశారని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు ఎందుకు ఆలస్యంగా నమోదు చేశారని అడిగింది. ఇలా కేసుపై ఎన్నో ప్రశ్నలను సంధించింది. ఆస్పత్రిలో ఘటన జరిగిన ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించింది. ప్రిన్సిపాల్ రాజీనామా చేస్తే మరో కాలేజీలో ఎలా నియమించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. మెడికల్ కాలేజీలో భద్రత కోసం ప్రత్యేక నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పది మంది డాక్టర్లతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు చైర్మన్‌గా వైస్ అడ్మిరల్ డాక్టర్ ఆరేక్ సరైన్‌ను నియమించింది.