అక్షరటుడే, వెబ్‌డెస్క్: పంట వ్యర్థాల దహనం విషయంలో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్రాలు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఈవిషయంలో తాము గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణ కోసం కమిషన్ పర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది.