అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఢిల్లీ లిక్కర్‌స్కాంలో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో గతేడాది అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్‌ నేత మనీష్‌ సిసోడియాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనకు శుక్రవారం న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ ఇవ్వడంతో పాటు పాస్‌పోర్టును సరెండర్‌ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆయనను ఆదేశించింది. అయితే ఇదే కేసులో ఎమ్మెల్సీ కవిత సుమారు 6 నెలల క్రితం అరెస్టయిన విషయం తెలిసిందే. ఆమె సైతం బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.