అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో గత ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్‌ సొసైటీలకు జరిపిన భూకేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. గత ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టు సొసైటీలకు భూకేటాయింపులు చేసింది. వాటిని చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది.