అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : అలీగఢ్‌ యూనివర్సిటీకి మైనార్టీ హోదాపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ 2005లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. 4:3 మెజారీటీతో యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉందంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. వీరిలో సీజేఐతో పాటు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జేబీ పర్దివాలా, మనోజ్‌ మిశ్రాలు మైనార్టీ హోదా ఉండాలని తీర్పు ఇస్తే..జస్టిస్‌ సూర్యకాంత్‌, దీపాంకర్‌ దత్త, సతీశ్‌ చంద్రశర్మలు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ‘అడ్మినిస్ట్రేషన్‌లో మైనార్టీ సభ్యులు లేనంత మాత్రన.. ఆవర్సిటీ మైనార్టీ హోదా పోదు’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది.