అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఆరో టౌన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. టౌన్ పరిధిలో కొందరు పేకాడుతునట్లు సమాచారం రావడంతో క్రైమ్ పార్టీ పోలీసులు గురువారం రాత్రి దాడి చేశారు. ఈ సమయంలో పేకాడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. జూదరుల నుంచి రూ.లక్షకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అధికార పార్టీకి చెందిన నాయకులు ఉన్నట్లు సమాచారం. వారెవరన్నది తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement