అక్షరటుడే, ఆర్మూర్: మోర్తాడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సుంకెట గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. పేకాడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసి.. వారి వద్ద నుంచి రూ.12,170, తొమ్మిది మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మోర్తాడ్‌ ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు.