అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఏపీలో నామినేటెడ్‌ పోస్టులకు సంబంధించి రెండవ లిస్ట్‌ను టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీతో కూడిన 59 మందికి నామినేటెడ్‌ పదవులు కట్టబెడుతూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అందులో నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియమితులయ్యారు.