అక్షరటుడే, ఎల్లారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. మంగళవారం భవానీపేట్ ఉన్నత పాఠశాలలో తపస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు డీఏ విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం మధుసూదన్ రెడ్డి, రాజ్‌కుమార్, దుర్గయ్య, శ్రీకాంత్, యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.