అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో కారిడార్ రెండోదశ పనులకు తెలంగాణ సర్కారు పచ్చజెండా ఊపింది. రెండోదశలో సుమారు 76.4 కి.మీ మేర రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ. 24,269 కోట్ల వ్యయాన్ని అంచనా వేసింది. హైదరాబాద్‌లోని నాగోల్-శంషాబాద్, రాయదుర్గం-కోకాపేట్, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట వరకు రైల్వేలైన్ నిర్మించనున్నారు. పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7,313 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.4,230 కోట్లుగా నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో 196ను ప్రభుత్వం జారీచేసింది.