అక్షరటుడే, వెబ్‌డెస్క్ : పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు విచారణను తెలంగాణ హైకోర్టు నవంబర్ 11కు వాయిదా వేసింది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఆర్‌ఎస్ తరపున సీనియర్ న్యాయవాది మోహన్‌రావు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని వాదనలు వినిపించారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.