అక్షరటుడే, నిజామాబాద్: తెలంగాణ ట్రెజరీ, అకౌంట్స్ గెజిటెడ్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలెక్టరేట్ లోని ట్రెజరీ హాల్ లో అధ్యక్షుడు రాములు ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నూతన కార్యవర్గం ఎన్నిక అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. కార్యక్రమానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గందల పురుషోత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శి పరుశురాం, ఇతర కార్యవర్గ సభ్యులు సాయి రెడ్డి, శ్రీనివాస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, టీటీఎన్ జీవోఏ అధ్యక్ష, కార్యదర్శులు మారుతి, కార్తీక్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్ట శ్రీవాస్ పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ట్రెజరీ సభ్యులు పాల్గొన్నారు.