అక్షరటుడే, వెబ్ డెస్క్: ఏపీ వక్ఫ్ బోర్డును తెలుగుదేశం సర్కారు రద్దు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జారీ కాబడిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో -47ను ఉపసంహరిస్తూ.. జీవో-75 జారీ చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది అక్టోబరు 21న అప్పటి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నామినేట్ చేయబడ్డ సభ్యుల నియామకాల తీరుపై కొందరు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.