అక్షరటుడే, బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేట లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఆలయంలో పారాయణం నిర్వహించనున్నారు. 8న కుంకుమార్చన, 9న శాలప్రతిష్ఠ, 10న లక్ష్మీనృసింహస్వామి కళ్యాణం, 12న స్వామి వారి రథోత్సవం, భజన పోటీలు, 13న చక్రతీర్థం, కుస్తీ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ ప్రధాన పూజారి కుండమాచార్యులు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఏవో వేణు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Engineering College | ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి