అక్షరటుడే, బాన్సువాడ: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన ఘటన బీర్కూరు మండలం కిష్టాపూర్ శివారులో గురువారం చోటుచేసుకుంది. చించోలి నుంచి ఇసుక తీసుకువెళ్లి అన్‌లోడ్ చేసి వస్తున్న క్రమంలో కిష్టాపూర్ శివారులో ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ పురుషోత్తం కాళ్లు, చేతులు విరిగాయి. స్థానికులు క్షతగాత్రున్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.