అక్షరటుడే, వెబ్‌డెస్క్: విడుదలకు ముందు నుంచే పుష్పరాజ్ రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా విడుదలైన పుష్ప-2 ట్రైలర్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా 40 మిలియన్ల వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్‌గా పుష్ప-2 నిలిచింది. ఇది నటుడు అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఆల్‌టైం రికార్డు అని నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ‘పాట్నాలో మొదలైన వైల్డ్‌ఫైర్.. దేశమంతంటా విస్తరించి.. డిసెంబర్ 5న చెలరేగుతోందని.., పార్టీ కోసం వేచి ఉండలేకపోతున్నా పుష్ప’ అని దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడడానికి 2.6 లక్షల మంది వచ్చారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఎక్కువ మంది చూసిన లైవ్ ఈవెంట్ ఇదేనని.. ‘పుష్పరాజ్ వస్తున్నాడంటే రికార్డులు కూడా వచ్చేస్తాయి’ అనే క్యాప్షన్‌తో మైత్రీమూవీ మేకర్స్ మరో పోస్టు పెట్టింది.
Advertisement
Advertisement