అక్షరటుడే, వెబ్‌డెస్క్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రత్యేకించి గ్రూప్ -1 అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ఎక్కడా.. అంటూ విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడిని కలిసేందుకు గ్రూప్ -1 అభ్యర్థులు గురువారం తరలివచ్చారు. ఉదయం మార్నింగ్ న్యూస్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిని కల్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చాడు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా కొట్లాడే బాధ్యత తనదని చెప్పారు. దీంతో అభ్యర్థులు గాంధీ భవన్‌కు చేరుకున్నారు. కానీ మల్లన్న మాత్రం అక్కడికి రాలేదు. పీసీసీ ప్రెసిడెంట్‌ను కలిసేందుకు అభ్యర్థులు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. మా తరపున కొట్లాడతానన్న తీన్మార్ మల్లన్న ఎక్కడా అంటూ ప్రశ్నించారు. కాగా.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ స్పందించి గ్రూప్ -1 అభ్యర్థులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.