అక్షరటుడే, వెబ్‌డెస్క్: రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకతతో ముడిపడిన బోనస్ రూపంలో చెల్లించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 11.72 లక్షల రైల్వే ఉద్యోగులకు బోనస్ అందనుందని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే బోనస్‌పై పరిమితితో ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా రూ.17,951 మాత్రమే వస్తుంది.