అక్షరటుడే, బోధన్‌: ప్రభుత్వం నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కార్మిక సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం ఫ్యాక్టరీ ప్రధాన గేటు ఎదుట విలేకరులతో మాట్లాడారు. నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరిపిస్తుందని తమకు నమ్మకముందని, అయితే అప్పటివరకు కార్మికులకు రావాల్సిన వేతనాలు చెల్లించాలని కోరారు. అలాగే ఫ్యాక్టరీ రీ ఓపెన్‌పై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించాలన్నారు. ఫ్యాక్టరీని త్వరగా తెరిపించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు కుమారస్వామి, రవిశంకర్‌ గౌడ్, శ్రీనివాస్, బాలకృష్ణ, రాంబాబు భాస్కర్, రమేష్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.