అక్షరుటుడే, నిజాంసాగర్: పిట్లం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యూనిఫామ్, డైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులంతా ఒకే యూనిఫామ్‌తో నృత్యాలు చేసి అలరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కవి, బాలజ్యోతి, జువేరియా, వీణ, అరుణ, దివ్య తదితరులు పాల్గొన్నారు.