అక్షరటుడే, బోధన్ : గ్రామంలో సేకరించిన చెత్తను బావిలో వేయడంపై ఎడపల్లి మండలం జానకంపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు మాట్లాడుతూ.. గ్రామంలోని ఒకటో వార్డులో గల బావిని మట్టితో పూడ్చకుండా చెత్తతో నింపారని, ఈ కారణంగా దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామని తెలిపారు. సత్వరమే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement
Advertisement