అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : నిజామాబాద్‌ ఒకటో డివిజన్‌లోని కాలూర్‌ గ్రామస్తులు గ్రామంలోని రైస్‌ మిల్లులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈమేరకు గురువారం వీడీసీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ మకరంద్ కు ఫిర్యాదు చేశారు. రైస్‌మిల్లుల నుంచి విడుదల అవుతున్న నీరు స్థానిక చెరువులోకి వదులుతుండటంతో పశువులు చనిపోతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు భారీవాహనాలతో రోడ్డు పాడవుతుందని తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు.