జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ గ్రామస్థులకు “కాటి” కష్టాలు తప్పడం లేదు. గ్రామంలో ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియల కోసం వాగు దాటాల్సిందే..! ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వాగులో నీరు ప్రవహిస్తోంది. సోమవారం గ్రామానికి చెందిన చిన్నుబాయి అనే వృద్ధురాలు మృతి చెందగా, ఇలా వాగులో నుంచి అవస్థలు పడుతూ ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. వాగుపై వంతెన నిర్మిస్తే “కాటి” కష్టాలు తీరుతాయని గ్రామస్థులు కోరుతున్నారు.

అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ (శ్రీనివాస్, రిపోర్టర్)