అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండలం హుమ్నాపూర్‌లో తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు బుధవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారం రోజులుగా గ్రామంలో తాగునీరు సరఫరా కావటం లేదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.