అక్షరటుడే, జుక్కల్‌: నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 13 టీఎంసీలకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి 32,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1401.56 అడుగుల(13.148 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.