అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వచ్చిన యువకుడు అదృశ్యమయ్యాడు. గన్నారం గ్రామానికి చెందిన నారాయణ మతిస్థిమితంలేని తన కుమారుడు గణేశ్ ను తీసుకొని గురువారం జీజీహెచ్ కు వచ్చారు. రాత్రి కావడంతో అక్కడే నిద్రించారు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి గణేశ్ కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన నారాయణ తన కుమారుడి కోసం చుట్టుపక్కల వెతికాడు. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ వో విజయ్ బాబు తెలిపారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  GGH Nizamabad | నిర్మించారు.. వదిలేశారు: అందుబాటులోకి రాని మాతా శిశు ఆస్పత్రి