Wrestling | మల్లయోధులను మట్టికరిపించిన యువతి

Wrestling | మల్లయోధులను మట్టికరిపించిన యువతి
Wrestling | మల్లయోధులను మట్టికరిపించిన యువతి

అక్షరటుడే, బోధన్: Wrestling | గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే కుస్తీ పోటీల్లో సాధారణంగా పురుషులే ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. క్రీడా టోర్నమెంట్(Sports tournament)​లో మహిళలు కుస్తీలో పాల్గొన్న మహిళలతోనే తలపడతారు.

Advertisement

అయితే ఢిల్లీకి చెందిన బల్జిత్​ కౌర్​ మాత్రం కుస్తీ పోటీల్లో తలపడి మగవారిని మట్టికరిపించి విజేతగా నిలిచింది. బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలో మల్లమ్మ జాతరను పురస్కరించుకొని శనివారం కుస్తీ పోటీలు(Wrestling competitions) నిర్వహించారు. ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ పోటీలకు పలు ప్రాంతాలను నుంచి మల్లయోధులు తరలివచ్చారు. ఢిల్లీ నుంచి బల్జిత్ కౌర్ wrestler Baljit kour(27) మాత్రం తన ప్రతిభతో ఆకట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Wrestling competitions | కొల్లూర్​లో కుస్తీపోటీలు

ఈ యువతి మగవారితో సమానంగా కుస్తీ పోటీలో పాల్గొని వారిని మట్టి కరిపించింది. విజేతగా నిలిచిన ఆమెకు నిర్వాహకులు పది తులాల వెండి కడియం అందజేశారు. మహిళా మల్లయోధురాలిని(female wrestler) చూసేందుకు జనాలు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో పెగడాపల్లి వీడీసీ ఛైర్మన్​ దొనకంటి లక్ష్మారెడ్డి, సొసైటీ ఛైర్మన్ దొనకంటి రాజారెడ్డి, సంజీవ్, మంద నాగరాజు, అబ్బన్న, గణేష్ పాల్గొన్నారు.

Advertisement