అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో చోరీ జరిగింది. శనివారం రాత్రి రోటరీ నగర్ లో తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.25 వేల నగదు దోచుకెళ్లారు. ఇంటి యజమాని ఈర్ల కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.