అక్షరటుడే, కామారెడ్డి టౌన్: హైదరాబాద్ లోని కోకాపేటలో నిర్మించిన దొడ్డి కొమరయ్య కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి జిల్లాలోని కురుమలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు మర్కంటి భూమన్న కోరారు. సోమవారం ఇల్చిపూర్ సరస్వతి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉన్న అన్ని స్థానాల్లో పోటీచేసి రాజకీయంగా ఎదగాలన్నారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు బుచ్చన్న, చంద్రం, ముత్యం, గంగాధర్, గంగారాం, దేవర లక్ష్మి, మల్లేష్, విఠల్, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.