అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలోని కుమ్మరిగల్లీలో వారం రోజుల నుంచి నీటి ఎద్దడి నెలకొంది. పైప్ లైన్ పగిలిపోవడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నీటి ట్యాంకు ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.