MLC Mallanna: తీన్మార్​ మల్లన్న దారెటు?

Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC Mallanna:కాంగ్రెస్​ పార్టీ నుంచి సస్పెండైన తీన్మార్​ మల్లన్న తర్వాత ఏ పార్టీలో చేరుతారో అనే చర్చ జరుగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో మల్లన్నను సస్పెండ్​ చేసిన విషయం తెలిసిందే. దీంతో తర్వాత ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు వేస్తారని ఆసక్తి నెలకొంది.

Advertisement

MLC Mallanna:జర్నలిస్ట్​ నుంచి..

తీన్మార్​ మల్లన్న(చింతపండు నవీన్​) జర్నలిస్ట్​గా జీవితం ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగారు. మొదట ఓ ఛానెల్​లో పనిచేసిన ఆయన.. అక్కడ వార్తలు చెప్పిన పాత్ర పేరుతోనే ఫేమస్​ అయ్యారు. అనంతరం ఆయన క్యూ న్యూస్​ పేరిట సొంత యూ ట్యూబ్​ ఛానెల్​ పెట్టుకున్నారు. బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ఛానెల్​లో మాట్లాడేవారు. కేసీఆర్​, కేటీఆర్​లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన అరెస్టు కూడా అయ్యారు.

MLC Mallanna: బీజేపీలో చేరి..

బీఆర్​ఎస్​ హయాంలో జైలుకెళ్లిన తీన్మార్​ మల్లన్న బయటకు రావడంలో బీజేపీ కృషి చేసినట్లు ప్రచారం. ఎంపీ అర్వింద్​ జైలుకెళ్లి మరి మల్లన్నను పరామర్శించారు. దీంతో మల్లన్న విడుదలయ్యాక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ సిద్ధాంతాలతో పొసగక కొద్దిరోజులకే బయటకు వచ్చారు.

MLC Mallanna: ఎమ్మెల్సీగా పోటీ చేసి..

తీన్మార్​ మల్లన్న బీఆర్​ఎస్​ హయాంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఓడినా పల్లా రాజేశ్వర్​రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. అనంతరం మల్లన్న కాంగ్రెస్​లో చేరారు. తర్వాత పల్లా ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లన్న ఘన విజయం సాధించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Nara Lokesh : నారా లోకేష్‌కి ఇష్ట‌మైన హీరో ఎవ‌రు.. ఎందుకు ఆయ‌నంటేనే ఇష్టం

MLC Mallanna: పార్టీపై విమర్శలు

అధికార పార్టీలో ఉన్న మల్లన్న బీసీ నినాదం ఎత్తుకున్నారు. ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ మాట్లాడారు. కుల గణనపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీసీల సభలో పాల్గొన్న మల్లన్న.. రెడ్డి సామాజిక వర్గంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మల్లన్నను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. అయితే మల్లన్న తర్వాత ఏ పార్టీలో చేరుతారననే చర్చ జరుగుతోంది.

MLC Mallanna: సైకిల్​ ఎక్కుతారా..

బీజేపీలోకి వెళ్లి వచ్చిన తీన్మార్​ మల్లన్న బీఆర్​ఎస్​లోకి వెళ్లే అవకాశం లేదు. కాంగ్రెస్​ సస్పెండ్​ చేయడంతో ఆయన టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతారని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.