అక్షరటుడే, వెబ్డెస్క్: షేర్ మార్కెట్లో పతనమాగడం లేదు. బుధవారం ఉదయం సెన్సెక్స్ 180 పాయింట్లు, నిఫ్టీ 61 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఉదయం 11:45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 530 పాయింట్లు, నిఫ్టీ 190 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఎయిర్టెల్, బ్రిటనియా, విప్రో లాభాలతో కొనసాగుతుండగా హిందాల్కో, హీరో మోటార్స్, ఐచర్ మోటార్స్, ఎంఅండ్ఎం, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.