అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: మాధవనగర్‌ రైల్వే గేట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. ఇరువైపులా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఇటు బైపాస్‌వైపు, అటు మాధవనగర్‌వైపు సుమారు కిలోమీటర్ మేర భారీగా వెహికిల్స్‌ ఆగిపోయాయి. వన్ వే కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.