అక్షరటుడే, వెబ్డెస్క్ : by-elections | రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు by-elections రావని సీఎం రేవంత్రెడ్డి CM Revanth Reddy అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ వారు అక్కడికి వెళ్లినా.. అక్కడి వారు ఇక్కడికి వచ్చినా.. ఉప ఎన్నికలు జరగవని వ్యాఖ్యానించారు. సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో Congress from BRS చేరిన వారిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. వారిపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు సుప్రీం కోర్టును Supreme Court ఆశ్రయించారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.
ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ former CM KCR, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR మాట్లాడుతూ.. పార్టీ మారిన వారి స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు by-elections రావని చెప్పారు. తమ ప్రభుత్వం ఉప ఎన్నికలపై కాకుండా.. అభివృద్ధిపై పోకస్ పెట్టిందన్నారు.