అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Election | హైదరాబాద్(Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(MLC) అభ్యర్థులను బీజేపీ, ఎంఐఎం ప్రకటించాయి. బీజేపీ(BJP) అభ్యర్థిగా ఎన్ గౌతంరావు పేరును శుక్రవారం కేంద్ర నాయకత్వం ప్రకటించింది. ఈ రోజుతో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది. దీంతో గౌతంరావు మరికొద్దిసేపట్లో నామినేషన్ వేయనున్నారు. గౌతమ్ రావు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం మే 1తో ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 23న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
MLC Election | ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం(MIM) అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫెండ్ ఎంపికయ్యారు.. గతంలో ఆయన రెండు సార్లు కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంఐఎం అవకాశం అవకాశం ఇచ్చింది. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉంది. బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఎంఐఎం, బీజేపీ మధ్యే పోటీ ఉండటనున్నట్లు తెలుస్తోంది.
MLC Election | ఎవరి బలం ఎంతంటే..
హైదరాబాద్‌లో మొత్తం 109 మంది లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు. 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరిలో కాంగ్రెస్-14 ఓట్లు, ఎంఐఎంకు 49, బీఆర్ఎస్–24, బీజేపీకి 22 ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఆ పార్టీ ఎంఐఎంకు మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం.