అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bikes | ప్రస్తుత రోజుల్లో బైక్ తప్పనిసరి అయ్యింది. అది లేకుండా అడుగు వేసే పరిస్థితి లేదు. అయితే మోటార్ సైకిళ్లలో రాయల్ ఎన్ఫీల్డ్ స్టైలే Royal Enfield style వేరు.. వీటిపై వస్తుంటే రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. దీంతో యువతలో ఈ బండ్లకు యమ క్రేజ్ ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పాటు పలు ఇతర బైక్‌లు కూడా లుక్‌తో ఆకట్టుకుంటూ మార్కెట్లో భారీగా అమ్ముడవుతున్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ Royal Enfield company పలు మోడళ్లలో బైక్‌లను విడుదల చేస్తుంది. అన్ని బైక్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 Royal Enfield Classic 350 ఎక్కువగా అమ్ముడవుతుంది. ఈ బైక్ అత్యధికంగా 115 కి.మీ. వేగంతో వెళ్లగలదు. తాజాగా ఈ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ Royal Enfield Classic 650 మోడల్‌ను విడుదల చేసింది.
Bikes | ఈ బైక్‌లు ప్రత్యేకమే..
- రాయల్ ఎన్ఫీల్డ్ కాకుండా ఇతర ప్రీమియం బైక్‌లు premium bikes కొనాలనుకునే వారికి పలు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో హోండా సీబీ 350 ఒకటి. దీని ధర రూ.2 లక్షల నుంచి రూ.2.18 లక్షల ఉంది. గంటకు 130 కి.మీ. వేగంతో వెళ్లొచ్చు.
- జావా 350 : జావా మోటార్ సైకిల్ ఈ బైక్‌ను మొత్తం ఐదు వేరియంట్లలో విడుదల చేస్తోంది. దీని ధర రూ. 2.15 లక్షల వరకు ఉంది. గరిష్టంగా గంటకు 125 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.
- హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 : దీనిని హీరో మోటోకార్ప్ అవుట్‌లెట్‌ల ద్వారా భారత మార్కెట్లో విక్రయిస్తోంది. కంపెనీ మూడు రకాల్లో ఈ బండిని అమ్ముతోంది. 135 కి.మీ. వేగంతో వెళ్లగలదు.
- హీరో మార్విక్ 440 : హీరో సంస్థ ఈ బైక్‌ను తయారు చేసింది. రూ. 2 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్య ధర ఉంది.
- బీఎస్ఏ గోల్డ్‌స్టార్ 650: ఈ మోడల్ భారత మార్కెట్లో రెండు వేరియంట్లు, ఆరు కలర్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి రూ.3.35 లక్షల వరకు ఉంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.