అక్షరటుడే, మోపాల్: MOPAL | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం(Modi government) రాజ్యంగ విలువలను కాలరాస్తున్నారని టీపీసీసీ డెలిగేట్(TPCC Delegate) శేఖర్ గౌడ్ (Shekhar Goud) అన్నారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్లో భాగంగా మోపాల్ (Mopal) మండలంలోని బాడ్సి, చిన్నాపూర్, కులాస్పూర్ గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజల కోసం అంబేద్కర్(Ambedkar) కల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మోపాల్ మండలాధ్యక్షుడు సాయి రెడ్డి, బాడ్సి సొసైటీ ఛైర్మన్ మోహన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.