అక్షరటుడే, కామారెడ్డి: Medical College | మెడికల్ కళాశాల(Medical College) ఔట్ సోర్సింగ్ (Outsourcing) ఉద్యోగాలు డబ్బులు తీసుకుని ఇచ్చారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ ఆరోపించారు. మ్యాన్ పవర్ ఏజన్సీ(Manpower Agency) ద్వారా రోస్టర్(Roster) పాటించకుండా ఉద్యోగాలు కేటాయించారని ఆరోపిస్తూ కలెక్టరేట్ వద్ద టీఎన్ఎస్ఎఫ్(TNSF), టీజేఎస్(TJS) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెడికల్ కళాశాల((Medical College))లో 50 ఉద్యోగాల కోసం ఔట్ సోర్సింగ్(Outsourcing) విభాగంలో 700 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే అందులో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఉద్యోగాలు ఏ ప్రాతిపదికన ఇచ్చారో ఆ వివరాలను ఇప్పటికీ బయట పెట్టడం లేదని వారు ఆరోపించారు. ఏజెన్సీ(Agency) రద్దవుతుందనే ఉద్దేశంతో రెండు రోజుల ముందే రాత్రికిరాత్రి నియామకాలు చేపట్టారని, రోస్టర్(Roster) నిబంధనలను కూడా పాటించలేదని తెలిపారు. కలెక్టర్(Collector) వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, నవీన్, సంతోష్, సందీప్, బాలకృష్ణ, ప్రభు, విష్ణువర్ధన్, నవనీత్, రాహుల్, రంజిత్, సాయి, అంజి తదితరులు పాల్గొన్నారు.