Sadashiv Nagar | దొంగకు దేహశుద్ధి.. చికిత్స పొందుతూ మృతి

Sadashiv Nagar | దొంగకు దేహశుద్ధి.. చికిత్స పొందుతూ మృతి
Sadashiv Nagar | దొంగకు దేహశుద్ధి.. చికిత్స పొందుతూ మృతి
Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్ : Sadashiv Nagar | ఆలయంలో దొంగతనానికి యత్నించిన ఓ వ్యక్తిని పట్టుకున్న గ్రామస్థులు అతనికి దేహశుద్ధి చేశారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. సదాశినగర్‌ మండలం ఉత్తునూర్‌లోని హనుమాన్‌ ఆలయంలో మంగళవారం రాత్రి అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌(25) చోరీకి యత్నించాడు. గమనించిన గ్రామస్థులు అతన్ని పట్టుకుని చితకబాదారు.

తీవ్ర గాయాలపాలైన శ్రీకాంత్‌ను పోలీసులు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement